నందమూరి నట‘సింహ’ బాలకృష్ణ లైన్ లోకి వస్తున్నాడు!

Tuesday, April 27, 2010
తెలుగు సినీ పరిశ్రమ(నిర్మాతలు) పచ్చగా ఉండాలనే ప్రయత్నంలో కొన్ని రోజులుగా ప్రక్షాళన జరుగుతున్న విషయం తెలిసిందే. తక్కువ ఖర్చుతో మంచి సినిమాలు తీసి అటు నిర్మాతలు, ఇటు పరిశ్రమ బాగుపడాలని నిర్మాతలందరూ సమావేశాలు ఏర్సాటు చేస్తున్నారు..ఈ విషయంపై ఇప్పటికే భిన్న స్వరాలు వినబడుతున్నాయి. నిర్మాతలందరూ నటులపై కక్ష్య పెట్టుకున్నట్టుగా రెమ్యూనరేషన్ లో కోత విధిస్తుంటే వారే కాదు..ఒక నిర్మాత సినిమాలో చేయడానికి డేట్స్ ఇచ్చిన తర్వాత మరో సినిమా అవకాశం వచ్చిన వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్సడుతున్నాయి. అలాంటప్పుడు మేం కూడ నష్టపోతున్నాము కదా ఒక్కసారి ఆలోచించండి అంటూ నటులు తెలుపుతున్నారు.

అయితే ఇటు నటులకు, అటు నిర్మాతలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడడానికి మధ్యవర్తిగా నందమూరి నటసింహాం బాలకృష్ణ లైన్ లోనికి వస్తున్నాడు..ఈ మధ్య ఏ చిన్న విషయం జరిగినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ముందుంటున్న బాలయ్య ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని..పరిష్కరిస్తారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఏర్సాటు చేసిన భేటిలో తెలిపాడట. మరి బాలకృష్ణ ఈ ముఖ్య ఘట్టంలో కీలకపాత్ర వహించి చిత్ర పరిశ్రమలోని ఆర్టిస్ట్లకు, అలాగే నిర్మాతలకు మధ్య సంప్రదింపులు జరిపి ఎవరికి అన్యాయం జరుగకుండా అలాగే అందరికీ న్యాయం జిరిగేలా చూడాలని ఆయన అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాలు కూడా ఆశపడుతున్నాయని సమాచారం.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates