జూ ఎన్టీఆర్-దిల్ రాజుల గొడవకి కారణం ప్రకాష్ రాజా...!???

Monday, April 26, 2010
ప్రస్తుతం ఇండస్టీలో హాట్ టాపిక్ ఎన్టీఆర్-దిల్ రాజుల గొడవ. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వ్యవహారాల్లో తలదూర్చినందుకు దిల్ రాజు పై ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడనీ, చీవాట్లు పెట్టాడనీ, ‘బృందావనం’ షూటింగ్ కోసం ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేసేసి ‘శక్తి’ షూటింగ్ లో పాల్గొంటున్నాడనీ పుకార్లు షికార్టు చెయ్యడంతో అంతటా దీని పై డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. మొత్తానికి ఈ అపోహలన్నింటికీ ప్రధాన కారకుడు ప్రకారాజ్. భారీ తారగణంతో తెరకెక్కుతున్న ‘బృందావనం’ షూటింగ్ నిరాటంకంగా జరుగుతున్న టైమ్ లో ఇందులో కీలక పాత్ర పోషిస్తోన్న ప్రకాష్ రాజ్ తన దైన శైలిలో హ్యాండిచ్చాడు.

నాగార్జున ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణమవుతున్న ‘గగనం’ చిత్రానికి ప్రకాష్ రాజ్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కావడంతో అతని దష్టంతా ఆ చిత్రంపైనే వుందిప్పుడు! ప్రకాష్ రాజ్ అందుబాటులో లేకపోవడంతో ‘బృందావనం’ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది. ఈ గ్యాప్ లో ‘శక్తి’ షూటింగ్ చేసుకోమని ఎన్టీఆర్ చెప్పడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో పాట చిత్రీకరణ ప్లాన్ చేశారు అశ్వనీదత్. ఈ రోజు (26.04.10) నుండి ఎన్టీఆర్, ఇలియానాల పై పాట షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇవేమీ తెలియని కొందరు అవకాశ వాదులు లేని పోని రాద్ధాంతానికి తమ రాతలతో తెర తీశారని అసహనంగా అంటున్నారు దిల్ రాజు. మొత్తానికి తన గైర్హాజరీతో ఎన్టీఆర్-దిల్ రాజుల మధ్య పెద్ద గొడవే పెట్టేశాడు ప్రకాష్ రాజ్!

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates