బాలకృష్ణ అధ్యక్ష్యతన 'మా' అత్యవసర సమావేశం

Monday, April 26, 2010
తెలుగు హీరోలకు,నిర్మాతలకు మధ్య ఓపెన్ వార్ ప్రారంభమయ్యింది. రీసెంట్ గా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జెన్సీ మీటింగ్ లో ఆర్టిస్టుల వేతనాలు తగ్గించుకోవాలంటూ ఓ తీర్మానం చేసి దానిని లెటర్ రూపంలో ఆర్టిస్టులకు పంపించారు. అందులో ప్రొడక్షన్ ఖర్చు పెరిగిపోతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఈ నిర్ణయానికి తగినట్లు స్పందించకపోతే ఆరునెలలపాటు పరిశ్రమ ని షట్ డౌన్ చేయాల్సిన ఆప్షన్ ఒకటే ఉందని హెచ్చరించారు.

ఈ అల్టిమేటంకు స్పందనగా మూవీ ఆర్టిస్ట్స్ అశోశియేషన్ ఈ రోజు(ఏప్రియల్ 26) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంది. నందమూరి బాలకృష్ణ అధ్యక్ష్యతన ఈ మీటింగ్ జరగనుంది. ఈ విషయమై మా జాయింట్ సెక్రటరీ మహారధి మాట్లాడుతూ...మేము నిర్మాతల మండలి నుంచి ఓ ఉత్తరం అందుకున్నాం. దాదాపు రెండు వందలమంది ఆర్టిస్టులుకు, హీరోలందరికీ ఎస్.ఎస్.ఎస్ ల రూపంలో ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కు హాజరు కమ్మని తెలియచేసాం అన్నారు. అయితే అక్కడ ఏ విషయాలు చర్చకు రాబోతున్నాయనే విషయం తెలియచేయలేదు.

ఇక ఈ విషయమై ఓ పెద్ద ప్రొడ్యూసర్ మాట్లాడుతూ...మేం కేవలం రెమ్యునేషన్ కట్ విషయమై పట్టు బట్టడం లేదు. కొందరి ఆర్టిస్టుల బిహేవియర్ కు షాకయి ఈ నిర్ణయం తీసుకున్నాం. పెద్ద హోటల్స్ నుంచి ఫుడ్ ని తమ ఇంట్లో వాళ్ళకు పార్శిల్స్ గా పంపుమంటే ఏం చేస్తాం. వారిని హీరోలు సపోర్టు చేస్తారు. వారిని ఏమీ అడగలేం. ఇక మూడు కిలోమీటర్ల దూరం నుంచి తమ సొంత కార్లలో వచ్చి ట్రావెల్ ఎక్సిపెండేచర్ నిమిత్తం 2500 వసూలు చేస్తున్న అత్యాసకు ఎలా స్పందించాలో అర్ధం కాకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నారు.

ఇక మూవీ ఆర్టిస్టుల అశోషియేషన్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోతే ప్రస్తుతం షూటింగ్ లో జరుపుకుంటున్న పెద్ద చిత్రాలను కూడా ఆపుచేయాలనే గట్టి పట్టుదలతో నిర్మాతల మండలి ఉందని సమాచారం.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates