'సింహా' లో రెండు టిపికల్ పాత్రల్లో బాలకృష్ణ కనిపిస్తారు. అన్ని భావోద్వేగాలు ఆ పాత్రల్లో వుంటాయి అంటూ దర్శకుడు బోయపాటి శ్రీను అందరిలో ఆసక్తి రేపారు. ఇంతకీ ఆ రెండు పాత్రలు ఏమిటీ అన్నది ఎంక్వైరీ చేస్తే...ఒకటి మెడికల్ కాలేజీ ప్రొపెసర్, మరొకటి జమీందర్ అని తెలిసింది. ఫస్టాఫ్ లో కనిపించే బాలయ్య..స్నేహా ఉల్లాల్ తో ప్రేమ పాఠాలు చెబుతాడని, సెకెండాఫ్..ప్లాష్ బ్యాక్ లో నయనతార తో జమిందార్ గెటప్ లో అదరకొడతాడని తెలుస్తోంది. అలాగే జమీందార్ గా కనిపించే...బాలయ్య మీసకట్టు, గెటప్‌లో వైవిధ్యం కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా ఆంధ్రాలో చోటుచేసుకున్న యాసిడ్ దాడుల పై కూడా కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నమిత , స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. రేపు రిలీజవుతున్న ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ ఈ చిత్రంతో తిరిగి హిట్ స్లాట్ లోకి వెళతాడని అంతా భావిస్తున్నారు.
0 comments:
Post a Comment