విడుదలకు ముందే బాలకృష్ణ తాజా చిత్రం సింహా రికార్డులు నమోదు చేస్తోంది. శాన్ జోశేలోని సెరా ధియోటర్లో జరిగిన టిక్కెట్ వేలం పాటలో బళ్ళ కృష్ణ, టీడిపి అభిమాని భక్త కలిసి రెండువేల డాలర్లుకు ఈ టిక్కెట్లు సొంతం చేసుకున్నారు. మొదట ఈ చిత్రం టిక్కెట్టును డెట్రాయిట్ లో గంగాధర్ నాదెళ్ళ అనే వీరాభిమాని 1116 డాలర్లకు కొనుగోలు చేసారు. ఇప్పుడు కృష్ణ, భక్త ఈ రికార్డును బ్రద్దలు కొట్టారు. ఇంతకు ముందు స్టాలెన్ విడుదల సమయంలో జయరాం కోమటి అనే చిరంజీవి అభిమాని టిక్కెట్టును 1116 డాలర్లకు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ అదే రికార్డు. ఇప్పుడు సింహా దానిని బ్రద్దలుకొట్టింది. అలాగే ఇప్పటివరకూ ప్రి రిలీజ్ బిజినెస్ సింహా..82000 డాలర్లు అక్కడ చేసిందని అంచనా. సుప్రీం మూవీస్ డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రాన్ని ముందు అన్నట్లుగానే 25 ప్రింట్లతో విడుదల చేస్తున్నారు. రేపు సాయింత్రానికల్లా అమెరికాలో ఈ ప్రింట్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయి.
0 comments:
Post a Comment