రాణా, సెల్వరాఘవన్ కాంబినేషన్లో ప్రారంభం కానున్న నూతన చిత్రం కోసం హీరోయిన్ వేట ప్రారంభమయింది. ఓ నెల లోపలే షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రంలో నటించటానికి ప్రెష్ ఫేస్, కొత్త టాలెంట్ కావాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రంలో నటించటానికి ప్రక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ అమాయికంగా లుక్స్ ఉండి, ఏంజిల్ ఫేస్ లా కనిపించాలని కోరుకుంటున్నారు. అనుభవం లేకపోయినా పర్వాలేదని చెప్తున్నారు. అయితే ఎక్సపీరియన్స్ ఉంటే మరింత ఉపకరం అని వారి భావన. ఆసక్తి ఉన్న అమ్మాయిలు తమ క్లోజ్ అప్, ప్రంట్, ఫ్రొపైల్ ని ఈ మెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. తమ నటనని పరిచయం చేసే వీడియో క్లిప్ పంపితే మరీ మంచిది అంటున్నారు. కేవలం ప్రొఫెషనల్ పోర్ట్ ఫోలియో ఉన్నవారినే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. తమ ప్రొఫైల్స్ ని ఈ క్రింద ఎడ్రస్ కి పంపాలి..బెస్టాఫ్ లక్... casting@sureshproductions.com
0 comments:
Post a Comment