అండర్ ప్రొడక్షన్ లో ఉన్న ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం కోసం వేసిన ఓ సెట్ లో భారీగా మోసం జరిగిందంటూ రీసెంట్ గా బయిటకు వచ్చింది. ఆర్ట్ డైరక్టర్ ఇన్వాల్స్ అయిన ఈ రాకెట్ లో మాల్ ప్రాక్టీస్, కరప్షన్ బయిటపడి అందరికి షాక్ ఇచ్చాయి. మెటీరియల్ సప్లైయర్ తో కుమ్మక్కై ఆర్ట్ డైరక్టర్ అందికకాడికి మేసేయటం అందరినీ విస్మయపరిచింది. ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం కోసం కోటి అరవై లక్షల బడ్జెట్ తో ఓ సెట్ ని వేయటానికి ఆర్ట్ డైరక్టర్ ఎస్టిమేషన్ ఇచ్చారు. అయితే చివరకు దానిని రెండు కోట్ల నలభై లక్షలకు తేల్చారు. ఎందుకు ఇంత ఎగస్ట్రా అయిందని నిర్మాత తన మనుష్యులతో రహస్యంగా ఎంక్వైరీ చేయిస్తే...కూకట్ పల్లి (హైదరాబాద్) చెందిన ఓ మెటీరియల్ సప్లైయిర్ పేరు బయిటకు వచ్చింది. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్ట్ డైరక్టర్స్ అందరూ అతని వద్దే మెటీరియల్ తీసుకుంటూంటారు. ఏడేళ్ళ క్రితం టూ వీలర్ వెహికల్ లో తిరిగే అతను ఈ రోజు మెర్సిడన్ బెంజ్ కారులో తిరుగుతున్నాడు. అతని చేత దొంగ బిల్లులు రాయించి కమీషన్ తీసుకుని ఆ ఆర్ట్ డైరక్టర్ మోసం చేసారు. కాస్ట్ కట్ నేఫద్యంలో ఈ ఉదంతం కూడా టాపిక్ గా మారింది. ఇక మరో తెలుగు నిర్మాత రీసెంట్ గా తన సినిమా షూటింగ్ లో ఫుడ్ నిమిత్తం నలభై లక్షల బిల్ చెల్లించారు. అయితే తర్వాత దానికి అయిన ఖర్చు 12 లక్షలేనని..మిగతాది మింగేశారని తెలిసింది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా బృందావనం, అశ్వనీదత్ నిర్మాతగా శక్తి చిత్రాలు చేస్తున్నారు.
0 comments:
Post a Comment