మెగాస్టార్ స్థానాన్ని భర్తీచేయడం కోసంమే రామ్ చరణ్ కష్టాలు!

Wednesday, April 28, 2010
రామ్ చరణ్ నాల్గవ చిత్రానికి అన్ని కార్కక్రమాలు సిద్దం అయ్యాయి..ఈ చిత్రం ఈనెల 30న (సింహా విడుదల రోజు) అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. మగధీర రికార్డులను మరేదైనా (సింహా) చిత్రం తిరగరాస్తే వాటిని మళ్ళీ తిరగరాయడానికి చిత్రం ప్రారంభం అవుతుంది..అనిపించే విధంగా రామ్ చరణ్ చిత్రం ప్రారంభం అవుతుందట.

ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ నటించిన ‘బంగారం’ దర్శకుడు ధరణి..అద్బుతమైన కథను రెడీ చేసాడని వినికిడి..ఈ చిత్రం ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు. గత నెల రోజుల నుండి ఆస్ట్రేలియాలో ‘ఆరంజ్’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ నగరంలో ఓ వారం రోజుల పాటు ఉండి కొత్త చిత్ర ప్రారంభం, అలాగే తమిళ మగధీరకు డబ్బింగ్ పనులను పూర్తి చేసి మళ్లీ ఆసీస్ బయలు దేరుతాడట.

తండ్రి బాధ్యత తలకెత్తుకున్న రామ్ చరణ్..ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ఎటువంటి కష్టాన్ని అయినా లెక్కచేయననీ ఇటీవల ఓ ఇంటర్వూలో తెలిపిన విషయం గుర్తుండే ఉంటుంది. అందుకే ఎంతటి బిజీ షెడ్యూల్ అయినా లెక్క చేయకుండా కష్టపడుతున్నాడట. అంతేకాదు డ్యాన్స్ల్ లలో కష్టమైన స్టెప్స్ పెట్టమని కొరియోగ్రాఫర్ లకు కూడా సూచిస్తున్నాడట. ఇదంతా మెగాస్టార్ స్థానం కోసమేనా ..అంటున్నారు విమర్శకులు.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates