
అలాగే మహేష్ బాబు-త్రివిక్రమ్ ల చిత్రం ఆగస్ట్ లో వస్తుందని అన్నారు. అయితే ఇంకా నాలుగు పాటలను చిత్రీకరించాల్సి వున్నందున ఇది కూడా సెప్టెంబర్ లోనే రావచ్చు అని సమాచారం. ఇక రామ్ చరణ్ ‘ఆరంజ్’ ని ప్రేక్షకులకు దసరా కానుకగా ఇవ్వనున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొని దాదాపుగా టాకీపార్ట్ కంప్లీట్ చేసేసుకున్న ‘ఆరంజ్’ అక్టోబర్ లో రావడం ఖాయం అని చెబుతున్నారు ఆ చిత్ర వర్గం. అయితే రానున్న విజయదశమికి ఈ హీరోల విజయాలు, బాక్సాఫీస్ లో వసూళ్ల వర్షం కురిపించే శక్తి సామర్ధ్యాలు నిరూపితమవుతాయి కనుక నెంబర్ వన్ రేస్ లో ముందడుగు వేసేదెవరో తేలుతుందని వ్యాఖ్యానిస్తున్నారు సినీ అభిమానులు.
0 comments:
Post a Comment