బాలకృష్ణ బాబాయ్ కి థ్యాంక్స్: ఎన్టీఆర్

Thursday, June 24, 2010
'తెలుగు సినీ రంగం ఆశించిన ఘన విజయమిది. గొప్ప చిత్రం కావాలని ప్రేక్షకులు తొలి నుంచీ ఎదురు చూశారు. అందర్నీ సంతోషపరచినందకు బాబాయ్‌కీ, చిత్ర బృందానికీ థ్యాంక్స్‌" అంటూ ఉద్వేగంగా మాట్లాడారు జూ ఎన్టీఆర్‌. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన 'సింహా' అర్థ శతదినోత్సవ కార్యక్రమానికి వికారాబాద్ లో షూటింగ్ హడావిడిలో ఉన్న ఎన్టీఆర్ హాజరయ్యి అందరినీ ఆనందపరిచారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'సింహా' 338 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకొంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ వేడుకని నందమూరి హీరోలు, తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ, నమిత, బోయపాటి శ్రీనులకు దాసరి చేతుల మీదుగా జ్ఞాపికలు అందించారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు కల్యాణ్ ‌రామ్‌, రామ్‌, తారకరత్న, అశ్వనీదత్‌, అంబికా కృష్ణ, కేఆర్‌ విజయ, ఉదయ్‌కిరణ్‌, చక్రి, సి.కల్యాణ్‌, పరుచూరి గోపాలకృష్ణ, బెల్లంకొండ సురేష్‌, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates