
ఈ లోగా షాట్ రెడీ అయ్యింది. కానీ పోలీస్ పాత్రధారి ద్వివేదీ ముందుకు రావటం లేదు. కెమెరా ముందుకు రమ్మని యూనిట్ మొత్తం ద్వివేదీని బతిమాలింది. అయితే ద్వివేదీలో కదలిక లేదు. అలా చేస్తే తన కుటుంబ ప్రతిష్ట మంటగలసిపోతుందని, ఇంట్లోవాళ్లు, స్నేహితులు చులకనగా చూస్తారని, ఆ సన్నివేశంలో నటించటం తనకు సుతరామూ ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. చివరిదాకా అతడిని ఒప్పించటానికి ప్రయత్నించిన మణిరత్నం అసిస్టెంట్లు ఇక ద్వివేదీ దిగిరాకపోవటంతో అతడిని పోలిన వ్యక్తితో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు.
ఇక ఇదే విషయాన్ని ద్వివేదీ దగ్గర మీడియా ప్రస్తావించినప్పుడు అతడు స్పందించటానికి నిరాకరించాడు..."సినిమా రిలీజ్ అయ్యేదాకా నేను ఏం మాట్లాడకూడదనే షరతు ఉంది. కానీ సినిమాల్లో నగ్నంగా నటించటం గురించి మాట్లాడాల్సివస్తే క్షమించాలి...నేను అలా చేయను.... భారతీయులుగా మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి: అని చెప్పాడు.
0 comments:
Post a Comment