
ప్రముఖ
సంగీత దర్శకుడు ఇళయరాజా తన జీవితకాలంలో ఎన్నో నిలిచిపోయే పాటల్ని అందించారు..అందిస్తున్నారు. అయితే ఆ పాటలకు ప్రేరణ ఎక్కడిది..ఆ మాధుర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం గురించి ఇళయరాజా చెబుతూ "నేను సాధారణమైన మనిషిని. ఎప్పుడూ నా బాణీలకు ప్రేరణనిస్తున్న విషయం గురించి ఆలోచించలేదు. అది అలా వచ్చేస్తోందంతే! ప్రశాంతంగా కూర్చొని ఆత్మ మాట వింటుంటే సంగీతం దానంతట అది రావాల్సిందే! ఇన్నాళ్లూ ఆత్మతోనే సంగీతం అందించాను. సన్నివేశం, సందర్భం...వీలునిబట్టి సాహిత్యం తెలుసుకొని అందులో ఉన్న అర్థం గ్రహించి స్వరాలు సమకూరుస్తాను. దాన్ని మెచ్చుకుంటున్న శ్రోతలకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి" అన్నారు. అలాగే...సంగీత దర్శకుడు ఎవరైనా..కథను లోతుగా అర్థం చేసుకొని పరిస్థితికి తగ్గట్లుగా సరళమైన సంగీతాన్ని అందిస్తే..తప్పకుండా ప్రేక్షకుల్లోకి అది చేరుతుందని అన్నారు. అంతటి మహానుభావుడు కాబట్టే ఇప్పటికీ ఆయన సంగీతం మనల్ని మైమరిపిస్తుంది.
0 comments:
Post a Comment