హాట్ టాపిక్ గా మారిన బాలయ్య సెంటిమెంట్

Friday, June 25, 2010
నా సినిమాల టైటిల్స్‌లో సింహా కలిస్తే ఘనవిజయం సాధించడం ఖాయం అనే సెంటిమెంట్‌ నిజమైంది అంటూ బాలకృష్ణ సింహా యాభై రోజుల పండగ సందర్భంగా చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణకు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసినిదే అయినా, బహిరంగ రహస్యంలాంటి ఆ విషయం ఇలా ఎప్పుడూ బయటపడలేదు. కానీ ఇప్పుడు ఇలా ఆయన అనటంతో అంతటా మాట్లాడుకుంటున్నారు. అందులోనూ చాలా మంది హీరోలకు, నిర్మాత, దర్శకులుకు తమ పరిధిలో ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నా ఎప్పుడూ బయిటపడరు. కానీ బాలయ్య ఆనందంతో భోళాగా మాట్లాడి తన మనస్సులో మాటలును బయిట పెట్టి అందరినీ ఆనందపరిచారు. ఇక...సింహా గురించి బాలయ్య అదే స్టేజిపై...అత్యధిక థియేటర్లలో రికార్డ్‌ వసూళ్లతో అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకుని ముందుకు వెళ్లడం అంటే సామాన్యమైన విషయం కాదు అని తేల్చి చెప్పారు. ఆయన అన్నట్లుగా గానే సింహా చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాకు ఊపుని ఇచ్చింది.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates