
నిన్న(జూలై 24న) జరిగిన 'సింహా' చిత్రం అర్ధ దినోత్సవ వేడుకల్లో మీడియాకు
బాలకృష్ణ తన నిర్మాతల తరుపున క్షమాపణలు తెలియచేసారు.
హైదరాబాద్ మారియట్ హోటల్ లో జరిగిన ఈ వేడుకల్లో నిర్మాత పరుచూరి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేందర్..ఫిల్మ్ జర్నలిస్టులపై నోరు చేసుకున్నారు. దురుసుగా వ్యవహరించారు. దాంతో మీడియా మిత్రులంతా బోయ్ కాట్ చేయటానికి సిద్దమయ్యారు. వెంటనే ప్లేటు పిరాయించిన నిర్మాతలు..మీడియా వాళ్ళని ప్లీజ్ చేయటానికి ప్రయత్నించారు. అయితే ఆ ఛీప్ ట్రిక్స్ కి లొంగని వారు బయిటకు వెళ్ళబోయారు. ఇంతలో ఈ విషయాన్ని బాలకృష్ణకు కొందరు తెలియచేసారు. దాంతో వెంటనే స్పందించిన బాలకృష్ణ నిర్మాతల తరపున మీడియా వారిని క్షమాపణలు కోరారు. నిర్మాతలను గట్టిగానే మందలించారు. అంతేగాక మీడియావారు సింహా విజయానికి ఎంతో దోహదం చేసానన్నారు. మళ్ళీ ఇటువంటి తప్పు తిరిగి దొర్లరాదని నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో తిరిగి మీడియావారు ఈ పంక్షన్ ని కవర్ చేసారు.
0 comments:
Post a Comment