
ఒక్కసారి ప్లాష్ బ్యాక్ కు వెళితే ఎన్టీఆర్ అంత ఫాలింగ్ తో రాజకీయంలోనికి వస్తే ఖచ్చితంగా విజయం తనదే అనేంత స్థాయిని పొందిన చిరంజీవి అప్పుడు రాజకీయాలలోనికి రాను అని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఒకవేళ అతనికి ఈ ఆలోచన వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోనికి ఆహ్వానించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దాసరిని కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో భరించింది దాసరి కూడా చిరంజీవి నా చేతులలో ఉన్నాడు..అతనికి రాజకీయ ఆలోచన వస్తే వెంటనే కాంగ్రెస్ పార్టీలోనికి తీసుకు వచ్చే బాధ్యత నాది అని చెప్పి ఓ పదవిని కూడా వెలగబెట్టిన విషయం తెలిసిందే.
అయితే చిరంజీవి ఎవరు ఊహించనతంత విధంగా కొత్త పార్టీ పెట్టి దాసరిని కాంగ్రెస్ పార్టీలో నవ్వుల పాలు చేశాడు..ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అతనిని ఏం చేసిందో తెలిసిందే అప్పటి నుండి చిరుపై ‘నాగుపాము’లా పగబట్టిన దాసరి ఈ ‘లంకేశ్వరుడు’ ని విమర్శస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. అయితే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి వివాహానికి హజరైన సమయంలో మాత్రం చిరంజీవిని ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరూ నవ్వుతూ కాస్సేపు మాట్లాడుకోవడం అక్కడున్నవారిని అశ్చర్యపరిచింది. ఆ మాటకొస్తే, దాసరి, చిరంజీవి మధ్య ఈ తరహా వ్యవహారం ఇప్పుడేమీ కొత్త కాదు. చిరంజీవి తారసపడినప్పుడు అప్యాయంగా పలకరించడం, కౌగలించుకోవడం..ఒక ఎత్తైతే వేదికలెక్కి ప్రసంగాలు చేసేటప్పుడు చిరంజీవిని టార్గెట్ చేయడం దాసరికి కొత్తేమీ కాదు.
0 comments:
Post a Comment