
అయితే అన్ని సక్రమంగా జరిగి చిత్రం పూర్తయ్యి విడుదల తేదీని ప్రకటించే నాటికీ తీరా చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరికలు రావడంతో సినిమా ఆడితేనే అంతంత మాత్రం డబ్బులు వస్తుంటే..ఇప్పుడు అడ్డుకుంటామంటే నేను ఉరి వేసుకోవడమే. అని చిత్ర నిర్మాత శింగనమల రమేష్ మీడియాకెక్కనున్నాడట. చిత్రంలో నటించిన వారందరూ వారి వారి రెమ్యూనరేషన్ లు తీసుకుని సంతోషంగా ఉన్నారు. ఛిత్రం ఆగిపోయినా వారికి సంబంధం లేదు. ఒక్క నిర్మాతలే ఈ ఎఫెక్ట్ కు గురవుతారనేది గుర్తు పెట్టుకోవాలని ఆయన వేర్సాటు వాదులకు తెలియజేస్తున్నాడట. పవన్ పేరుకే గానీ ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్ని నేనే. దయచేసి నా చిత్రాన్ని అడ్డుకోవద్దని ఆయన తెలంగాణ వాదులకు తెలుపుతున్నాడట.
ఇది మొదటి కోణం..ఇంత చెప్పినా చిత్రాన్ని అడ్డుకోవాలని చూస్తే ‘మా’ పరిణామాలు ఎలా ఉంటాయో కూడా త్వరలో చూపిస్తాం అని రెండవ కోణాన్ని బయటపెడుగున్నాడు..చిత్ర నిర్మాత. దీన్ని బట్టి చూస్తుంటే నిర్మాతల మండలి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ గా ఉందని అర్ధమవుతోంది.
0 comments:
Post a Comment