చిరంజీవి పై రాజకీయ వ్యంగ్యాస్త్రాలు విసిరిన రజనీకాంత్!

Wednesday, April 28, 2010
రజనీకాంత్-ఐశ్వర్య రాయ్ లతో గ్రేట్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తోన్న 100కోట్ల భారీబడ్జెట్ చిత్రం ‘రోబో’ గురించి సంచలన కథనాలు ఆల్ రెడీ ప్రారంభమయ్యాయి. రజనీకాంత్ హీరోగా, విలన్ గా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారని, చిత్రంలో ‘సామాజిక’ రాజకీయాలపై కూడా వేడి వేడి వ్యాఖ్యలుంటాయని స్వయంగా దర్శకుడు శంకరే చెప్పడం జనంలో మరిన్ని ఊహలకు ఊతమిచ్చింది.

‘రోబో’ లో పాలిటిక్స్ గురించి రజనీ స్టైల్ లో పలికే పదునైన డైలాగులన్నీ తమిళనాడులో పార్టీ పెట్టి భంగపడ్డ విజయ్ కాంత్ కీ, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టి పరాజయం పాలైన చిరంజీవికీ తగిలేలా వుంటాయని కోలీవుడ్ న్యూస్. ‘రాజకీయాల పై సరైన అవగాహన లేని నాయకులు రాష్ట్రానికి సారధ్యం వహించలేరు. పదవులపై వ్యామోహంతో కాకుండా ప్రజాసేవే ముఖ్యమనుకుంటే దానికి రాజకీయాలు అవసరమే లేదు’ అనే ధోరణిలో ఉంటాయట ‘రోబో’ లో రజనీ రాజకీయ సూక్తులు. అయితే నిజానికి తమిళ్ లో రజనీ విసరాలనుకున్న రాజకీయ వ్యంగ్యాస్త్రాలు విజయ్ కాంత్, శరత్ కుమార్ లకే తప్ప చిరంజీవిపై కాదట. కానీ తెలుగుకి వచ్చేసరికి రాష్ట్రంలో కొత్తగా వెలిసిన ప్రజారాజ్యం పార్టీకే ఆ డైలాగ్స్ డైరెక్ట్ గా వర్తిస్తాయని సమాచారం. ఏంటో ఏమో ఏదో లక్కీ డ్రా తగిలేసినట్టు పార్టీ పెట్టినప్పట్నుంచీ లేనిపోని సమస్యలన్నీ చిరంజీవికే చుట్టుకుంటున్నాయి పాపం!

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates