
కంత్రి దర్శకుడు మెహర్ రమేష్ రూపొందిస్తున్న శక్తి చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇడస్ట్రీ గా మారింది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించటం ఒక ఎత్తయితే దానికి ఇండస్ట్రీలో పేరున్న ఐదుగురు రైటర్స్ రాత్రింబవళ్ళు స్క్రిప్టు చేయటం మరో హైలెట్. వాళ్ళు శ్రీరామదాసు, అన్నమయ్య వంటి చిత్రాలకు రచన చేసిన భారవి, ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్, సీనియర్ రచయిత సత్యానంద్, తోట ప్రసాద్, కన్నన్. ఇందులో హీరో ఓ పవర్ ఫుల్ శక్తిగా మారి హీరోయిన్ నే కాక ఓ పెద్ద వినాశనాన్నుండి ప్రపంచాన్ని రక్షిస్తాడని చెప్తున్నారు. మినిస్టర్ కూతరైన హీరోయిన్ కి బాడీగార్డుగా పనిచేసే హీరో చేసే సాహసకృత్యాలుతో ఈ చిత్రం నిండిఉంటుందని తెలుస్తోంది. ఇక
ఇలియానా హీరోయిన్ రాఖీ తర్వాత ఎన్టీఆర్ సరసన చేస్తోంది. ఇక మరో ప్రక్క ఎన్టీఆర్ ఈ చిత్రంతో పాటు బృందావనం చిత్రంలోనూ చేస్తున్నారు. కాజల్, సమంతా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తూండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.
0 comments:
Post a Comment