
అయితే తాజాగా అల్లు అర్జున్ బాటలో పవన్ కళ్యాణ్ సిక్స్ ప్యాక్ చేయబోతున్నాడట. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో పవన్ హీరోగా హిందీ ‘లవ్ ఆజ్ కల్’ రీమేక్ సినిమా ఇటీవల ఆరంభమైన విషయం విదితమే. ఈ చిత్రంలోనే పవన్ కళ్యాణ్ సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడని వినికిడి. దీనికోసం గ్రేట్ డైరెక్టర్ మరియు రచయితైన త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కోసమే స్ర్కిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. సో ఒంటి మీద చొక్కా లేకుండా పవన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మరి, పవన్ ఆరు పలకల దేహం ఎలా ఉంటుందో లేక అల్లు అర్జున్, నితిన్ లను మైమరపించే యంగ్ హీరో అనిపించుకొంటాడో వేచి చూద్దాం.
0 comments:
Post a Comment