
స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర
రెడ్డి కుమారుడు వైయస్ జగన్ త్వరలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టనున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన కొందరు నిర్మాతలు,దర్శకులుతో చర్చలు జరిపారని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రముఖంగా వినపడుతోంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, సిమెంట్ ఇండస్ట్రీలలో బిజీగా ఉన్న జగన్ ఓ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి తన వంతుగా కళాసేవ చేయాలని తలపోస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆయన డైరక్ట్ గా సీన్ లోకి రారని వెనక నుంచి ఫైనాన్స్ చేస్తారని కొందరు అంటున్నారు. ఇప్పటికే సాక్షి గ్రూప్స్ తో మీడియా రంగంలో అడుగుపెట్టిన జగన్ సిస్టర్ కన్సర్న్ లాంటి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టటం ఆశ్చర్యంలేదని అంటున్నారు. అలాగే సాక్షి చూస్తున్న ప్రియదర్శని రామ్ కే ఈ ప్రాజెక్టు డిటేల్స్ అప్పచెప్పారని చెప్తున్నారు. రామ్ ఇంతకు ముందు మనోడు, టాస్ దర్శకుడుగా,నిర్మాతగా తీసి ఉన్నారు. అలాగే జగన్ రీసెంట్ గా హాసిని చిత్రం ఆడియోకు అటెండు కావటం కూడా ఈ తరహా ఆలోచనలు తావిస్తోంది.
0 comments:
Post a Comment