పరిటాల రవి - మద్దెలచెరువు సూరి కుటుంబాల మధ్య రగిలిన ఫ్యాక్షన్ గొడవలను ఇతివృత్తంగా చేసుకుని క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం "రక్త చరిత్ర". ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల పట్ల అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మండిపడుతున్నట్లు భోగట్టా.
వీరి ఆవేశానికి కారణాలేమిటా అని చూస్తే... మద్దెలచెరువు సూరి మినహా ఆయన కుటుంబంలోని మగవాళ్లంతా పక్కా రేపిస్టులుగా "రక్త చరిత్ర" చిత్రంలో వర్మ చిత్రీకరించినట్లు భోగట్టా. ఈ సంగతి తెలుసుకున్న సూరి మద్దతుదారులు వర్మపై కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే మద్దెలచెరువు సూరి సోదరుడు ఓబుల్ రెడ్డిపై అత్యాచారం కేసులున్నట్లు సమాచారం. అంతేకాదు ఆయన ఓ పెళ్లయిన యువతిని బలవంతంగా రెండు వారాలపాటు తన అధీనంలో ఉంచుకోవడమేకాక ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ఆమెను భర్త వద్ద విడిచి పెట్టినట్లు ఆరోపణలున్నాయి. వీటిని ఆధారం చేసుకుని వర్మ తన "రక్త చరిత్ర"లో సూరి కుటుంబ సభ్యులు అత్యాచారాలకు పాల్పడినట్లు సన్నివేశాల చిత్రీకరణ చేసినట్లు సమాచారం.
అయితే ఇటువంటి సన్నివేశాలతో రక్త చరిత్ర విడుదలైతే ప్రజల్లో తమ పరువు పోతుందని సూరి మద్దతుదారులు వర్మపై మండిపడుతున్నట్లు సమాచారం. అయితే వర్మ మాత్రం తను ముంబయి మాఫియాకే లొంగలేదనీ, అటువంటిది ఈ చిత్రంపై ఎవరు బెదిరించినా పట్టించుకోనని చెప్పినట్లు సమాచారం.
అయినా... ఇష్టమున్నవారు తన సినిమా చూస్తారని, ఇష్టం లేనివారు చూడనవసరం లేదని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. మొత్తానికి రక్త చరిత్ర సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ఫ్యాక్షన్ రాజకీయాలు కదలాడనున్నాయి.

0 comments:
Post a Comment