‘మగధీర’ను మించేలా మా హీరో చిత్రం ఉండాలి!?

Wednesday, May 19, 2010
ఎంత పెద్ద డైరక్టర్ అయినా తాను తీయబోయే తదుపరిచిత్రం ఎలా ఉండాలో అటు హీరోలను ఇటు వారి ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని కథలను రెడీ చేయగల దిట్ట కల వ్యక్తి రాజమౌళి. దానికి ఉదాహరనే ‘మర్యాద రామన్న’, సునీల్ కారెక్టర్ ఆర్టిస్ట్, ఒక కమెడియన్ ను హీరోగా తెరమీద చూపాలంటే దాని వెనుక కష్టం, ఆలోచన సరళి, గట్స్ ఉన్న డైరెక్టరే రాజమౌళి. డైరక్టర్ రాజమౌళితో చిత్రం అనగానే హీరోలందరూ ముందువరుసలో ఉంటారు..రాజమౌళి కూడా హీరోను బట్టి తనకెలాంటి కథ అయితే బావుంటుందో సెలక్ట్ చేసుకొని మరీ రంగంలోకి దిగుతాడు. సంవత్సరం పాటు షూటింగ్ చేసినా ఆ చిత్రం బంపర్ హిట్ అయ్యేలా రూపొందిస్తాడు. ప్రస్తుతం రాజమాళి ఓ హీరోకు కథను సెట్ చేయలేక పోతున్నాడట. అందుకే అతనికి ఏలాంటి కథ అయితే నచ్చుతుందో ఆ హీరో అభిమానులు తమ హీరో నుండి ఏం కోరుకుంటున్నారో స్వయంగా వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి.

అందుకోసం ట్విట్టర్ లో లాగిన్ అయ్యి ఆ హీరో అభిమానులకు తెలియజేస్తున్నాడట. అవును ఇంతకీ ఆ హీరో పేరు చెప్పలేదు కదా? ఇంకెవరు ప్రిన్స్ మహేష్ బాబు. అలా రాజమౌళి చెప్పాడో లేదో ఇప్పటికే ట్విట్టర్ లో మహేష్ అభిమానులు తమ అభిమాన హీరోను ఏలా చూసుకోవాలని అనుకుంటున్నారో..తెలుపుతున్నారట. వారు చెప్పిన వాటిలో ఎక్కువగా ఉన్నది ఏమిటో తెలుసా? మగధీర మించేలా మహేష్ సినిమా ఉండాలట.. మరి రాజమౌళి కూడా దానికోసం రెడీ అవుతున్నాడని సమాచారం.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates