
అయితే మొత్తానికి 20 రోజుల గ్యాప్ లో పులి, సింహా థియేటర్ల పై దాడి చేయనున్నాయి. బాలకృష్ణ చిత్రం సింహా ఈ నెల 30న రిలీజ్ చేస్తుండగా పవన్ కళ్యాణ్ పులిని మే మూడో వారంలో రీలీజ్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో బాలెన్స్ పాటలను ఇంకా చిత్రీకరించాల్సి వుంది. ఇదిలా వుండగా సింహాలో బాలకృష్ణ మీసాల గెటప్ ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్స్ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచాయి. మాస్ ఎమోషన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
అలాగే కొమరం పులి స్టిల్స్ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి. పోలీస్ గెటప్ చక్కగా నీట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎలా కనిపించాలి..ఆయన సినిమాలు ఎలా ఉండాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. వీరిద్దరూ సక్సెస్ చూసి చాలా సంవత్సరాలైంది. ‘ఖుషీ’ తర్వాత పవన్ కు ‘నరసింహా నాయుడు’ తర్వాత బాలకృష్ణకు సరైన సక్సెస్ దక్కలేదు. మొత్తం మీద సింహాం, పులి సక్సెస్ అనే ఆకలి మీద ఉన్నాయి. మరి ఆకలి తీర్చుకోవడానికి ముందుగా ‘సింహా’ వస్తుంది, తర్వాత ‘పులి’ వస్తుంది అయితే సక్సెస్ ఎవరిదో వేచిచూడాల్సిందే.
0 comments:
Post a Comment