పాజిటివ్ టాక్ తో హాట్ కేకులా మారిన సింహా

Monday, April 19, 2010
ఈ మధ్యకాలంలో బాలకృష్ణ చిత్రానికీ రానంత పాజిటివ్ టాక్ సింహా చిత్రానికి రావటం జరిగింది. బాలకృష్ణ గత చిత్రాలు అన్నింటికీ రిలీజ్ కు ముందు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావటం అందుకు దగ్గట్లుగా అవి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం జరిగింది. అయితే ఈ సారి సినిమా చాలా బాగా వచ్చిందని, డిస్ట్రిబ్యూటర్స్ మంచి ఎమౌంట్స్ తో ఈ చిత్రం తీసుకోవటానికి ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం. అలాగే దాసరి సిరీ మీడియా పెద్ద మొత్తం చెల్లించి నైజాం రైట్స్ ని సొంతం చేసుకుంది. అలాగే బోయపాటి శ్రీను గత చిత్రాలు భద్ర, తులసి భాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోవటం కూడా ఈ చిత్రానికి ప్లస్ అయింది. ఈ నెల 30వ తేదీన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార , నమిత, స్నేహా ఉల్లాల్ నటిస్తున్నారు. అలాగే సెకెండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బాలయ్య గత చత్రాలు నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి నాటి ఎమోషన్స్ ను గుర్తుకుతెచ్చాలా రూపొందించారని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం పాటలు మార్కెట్లో ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్నాయి. ట్రైలర్స్ కూడా బాలయ్య గత వైభవాన్ని తెస్తాయా అన్నట్లు క్రేజీగా ఉన్నాయి.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates