గుంటూరు: హీరో బాలకృష్ణ బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. సింహా చిత్రం విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన ఇష్టదైవమైన లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలను బాలయ్య సందర్శిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయా దేవాలయాల్లో బాలయ్య ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని కదిరి, కడప, నల్గొండ జిల్లాలోని యాదగిరి తదితర పుణ్య క్షేత్రాలను బాలయ్య సందర్శిస్తున్నారు.
దీనిలో భాగంగా సింహా చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుతో కలిసి ఆయన లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వస్తున్నారు. సింహా దర్శకులు బోయపాటి స్వగ్రామం పెదకాకాని కావటంతో గ్రామంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శివాలయాన్ని సందర్శించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బాలయ్య విమానంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళగిరి లక్ష్మీ నరసింహ ఆలయానికి వస్తారు.
ఐదు గంటలకు ఆయన మంగళగిరి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ పూజలు అనంతరం పెదకాకాని శివాలయానికి తీసుకువచ్చేందుకు బోయపాటి శ్రీను ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సింహా చిత్రం విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఉత్సాహం ఉరకలెత్తుతోంది. దీంతో బాలయ్యను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు మంగళగిరి తరలి రానున్నారు. దీంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

0 comments:
Post a Comment