'సింహా'కి కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి. దీని ద్వారా ప్రభుత్వానికి 20 శాతం టాక్సు వచ్చే అవకాశం ఉంది. మొత్తంమీద మా సినిమా ద్వారా ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని దర్సకుడు బోయపాటి శ్రీను మీడియాకు తెలిపారు. అలాగే 'సింహా' చిత్రంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం మీద వచ్చే పాట చాలా బాగుందంటూ ఫ్యామిలీ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఆ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ఉన్న వేదాద్రి, మంగళగిరి, యాదగిరిగుట్ట, అంతర్వేది, సింహాచలం , అహోబిలం, ధర్మపుడి వంటి ప్రధాన క్షేత్రాలన్నీ నిర్మాత, బాలయ్య, నేను, కొంతమంది యూనిట్ సభ్యులతో కలిసి సందర్శించి అభిమానుల్ని కలవబోతున్నాం. ఈ నెల 12 నుంచి 21 వరకు మధ్యలో రెండు మూడు రోజుల విరామంతో ఈ యాత్ర నడుస్తుంది అని తెలియచేసారు.
బాలకృష్ణ హీరోగా నయనతార , స్నేహా ఉల్లాల్, నమిత హీరోయిన్స్ గా యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన 'సింహా' చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇక 'సింహా' సినిమాని పైరసీ చేసినవాళ్లని పట్టిచ్చేవాళ్లకి నిర్మాత కిరీటి రివార్డులు ప్రకటించారు. ఆయన మాటల్లోనే...మా 'సింహా' విజయవంతంగా రెండో వారం ప్రదర్శితమవుతోంది. ఇప్పటిదాకా పైరసీ బాధ లేదు. అక్కడక్కడా పైరసీ సీడీలు కనిపిస్తున్నాయని కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ పైరసీదారులకు శిక్ష విధించేలా చర్యలు తీసుకున్న తొలి ముగ్గురికి తలా రూ.2 లక్షలను అందజేస్తాం. మొత్తం మీద రూ.2కోట్లను దీనికోసం కేటాయిస్తున్నాం. పోలీసులు కూడా పైరసీని అరికట్టడంలో మరింతగా మాకు సహకరించాలని అన్నారు. అలాగే అభిమానులు, ప్రేక్షకులు పైరసీని అరికట్టడంలో సహకరించాలని పిలుపునిచ్చారు.

0 comments:
Post a Comment