
ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోనే ఇంతటి సంచలన విజయాన్ని ‘సింహా’ సాధించిందని, ‘సింహా’ రికార్డుల్ని వేటాడుతోందని బాలయ్య చెప్పారు. ‘సింహా’ ని సెన్సేషనల్ హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కతజ్ఝతలు తెలిపారు నటసింహా బాలకృష్ణ. లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలకు వెళ్ళి స్వామిని దర్శించుకునే ఈ కార్యక్రమంలో యువరత్న బాలకృష్ణ తో పాటు హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, యునైటెడ్ మూవీస్ అధినేత పరుచూరి ప్రసాద్, నిర్మాత పరుచూరి కిరీటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేంద్రబాబు ఇంకా పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
‘సింహా’ యూనిట్ ఎక్కడికి వెళ్లినా జయ జయ ధ్వానాలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఇంతటి పెద్ద విజయం తమ సంస్థకు వచ్చినందుకు చాలా ఆనందంగా వుందని పరుచూరి ప్రసాద్ అన్నారు. చిన్న వయసులోనే అతి పెద్ద హిట్ సాధించిన యంగ్ ప్రొడ్యూసర్ పరుచూరి కిరీటిని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బాలయ్యబాబు అద్బుత నటనతోనే ‘సింహా’ అఖండ విజయం సాధించిందని, ఇంతటి పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెపుతున్నాను అని దర్శకులు బోయపాటి శ్రీను అన్నారు. ఈ రోజు (19మే) నుండి అహోబిళం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి. మహేంద్రబాబు చెప్పారు.
0 comments:
Post a Comment