నాగచైతన్య, రాణా కాంబినేషన్ ఖరారు

Wednesday, May 26, 2010
నాగచైతన్య, రాణా కలిసి త్వరలో ఓ చిత్రం చేయబోతున్నారు. ఈ విషయాన్ని రాణా కన్ఫర్మ్ చేస్తూ..త్వరలో నేను, నాగచైతన్య కలిసి ఒక సినిమాలో నటిస్తాం అన్నారు. రాణాని హీరోగా పరిచయం చేస్తూ రిలీజ్ అయిన 'లీడర్‌ చిత్రం ఈ నెల 29న వందరోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా తన గురించి...తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికల గురించి రాణా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చారు.అలాగే బాబాయి వెంకటేష్‌తో సినిమా కోసం కథలు వింటున్నాం. సంతృప్తికరమైన కథ దొరికితే..తప్పక చేస్తాం అని తెలియపరిచారు. ఏం మాయ చేసావే చిత్రంతో రొమాంటిక్ హీరోగా ముద్రవేసుకున్న నాగచైతన్య ప్రస్తుతం అజయ్ భుయాన్ దర్శకత్వంలో చిత్రం చేయటానికి కమిటయ్యారు. కామాక్షి మూవీస్ బ్యానర్ పై శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ భుయాన్ ఇంతకుముందు హౌస్ ఫుల్ అనే చిత్రాన్ని డైరక్ట్ చేసారు. అది ఇంకా రిలీజ్ కాలేదు. ఈ చిత్రం అనంతరం సుకుమార్ దర్సకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించే చిత్రంలో నాగచైతన్య నటించనున్నారు. తమన్నా ఈ చిత్రంలో నాగచైతన్య సరసన చేయనుంది.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates