యంగ్ టైగర్ యన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే..బ్యాచిలర్ గా జరుపుకునే చివరి పుట్టినరోజు కావడంతో యన్టీఆర్ పరిశ్రమలోని తన తోటి హీరోలందరికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడట. అయితే ఈ పుట్టిన రోజుకి చాలా విశేషాలు ఉన్నాయి..ఎప్పుడూ లేనిది తొలిసారిగా మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పార్టీలో పాల్గొనడంతో పాటు ఈ ఫంక్షన్ లో డాన్స్ కూడా చేసాడని సమాచారం.ఒక్క క్షణం ‘మగధీర’ గా బాలకృష్ణ గానూ-‘సింహా’ గా చరణ్ నూ ఊహించుకోండి. భలే గమ్మత్తుగా వుంది కదూ..అక్షరలా ఇది నిజం..! రామ్ చరణ్ డాన్స్ చేసింది ఎవరి పాటకో తెలుసా? నందమూరి నటసింహం బాలయ్య ‘సింహా’ చిత్రంలోని ‘జానకి జానకి’ అనే పాటకి..ఈ పాటకు తనదైన స్టెప్ లతో ఇరగదీసాడట..చరణ్. అయితే అసలు చరణ్ డాన్స్ చేయడానికి కారణం తెలుసా? అంతకుముందు అదే ఫంక్షన్ లో చరణ్ ‘మగధీర’ చిత్రంలోని ‘బంగారుకోడిపెట్ట’ పాటకి బాలయ్య గొప్పగా డాన్స్ చేసాడట..అంతే చరణ్ కూడా వెంటనే అదే స్పిరిట్ తో రివర్స్ గేర్ వేసాడు. ఏదైతేనేం ఇటువంటి వార్తలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది పరిశ్రమలో ఎటువంటి కలతలు, కుట్రలు లేవని..అందరూ సినీ కళామతల్లి ముద్దుబిడ్డలమే అని ముందుకు వెళుతుంటే ఫలానా హీరో గొప్ప అనే బేధాలు ఉండవని ఆ ఫంక్షన్ లో చరణ్, బాలయ్యలను చూసిన వాళ్లు అనుకున్నారట.



0 comments:
Post a Comment