
మైఖేల్ జాక్సన్ అనుమానాస్పద మృతి కేసు మరో ఆశక్తికర మలుపు తిరిగింది. మైఖేల్ జాక్సన్ మరణానికి అతని డాక్టర్ ముర్రే కారణం కాదట... మైఖేల్ ను స్వయంగా అతనే అంతం చేసుకున్నాడట. గత ఏడాది జూన్ 25న తనకు నిద్రపట్టడం లేదని తన డాక్టర్ ముర్రేకు ఫోన్ చేసిన మైఖేల్ ఆ తర్వత తీవ్ర ఒత్తిడిలో వున్నాడట. ఫోన్ కాల్ తో హుటాహుటిన మైఖేల్ ఇంటికి చేరుకున్న ముర్రే తనకు నిద్రపట్టకపోవడానికి ఒత్తిడే ప్రధాన కారణం అని చెప్పి నిద్రరావడానికి ప్రొపొఫోల్ మందును ఇంజెక్షన్ చేసి బయటకు వెళ్లాడట. కానీ ఆ తర్వాత కూడా నిద్రపట్టని మైఖేల్ అక్కడే వున్న సిరంజీని తీసుకుని అధిక మోతాదులో ప్రొపొఫోల్ మందును ఇంజెక్ట్ చేసుకున్నాడని తిరిగి గదిలోకి వచ్చి చూసేసరికి మైఖేల్ నిర్జీవంగా పడివున్నాడని ముర్రే తరపు న్యాయవాది సరికొత్త వివాదానికి తెరలేపాడు.
కానీ ఈ విషయాన్ని మైఖేల్ తరపు న్యాయవాది ఖండిస్తున్నాడు. అసలు మైఖేల్ కు ఇంజెక్షన్ అంటే చాలా భయం అని అతనికి ఇంజెక్షన్ ఫోబియా వుందని అలాంటిది ఆయన ఎలా ఇంజెక్షన్ చేసుకోగలడని ఆయన తిరిగి ప్రశ్నించాడు. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న మైఖేల్ అనుమానాస్పద మృతి కేసు ఏ తీరానికి చేరుతుందో మరి..!?
0 comments:
Post a Comment