
దర్శక రత్న దాసరి నారాయణ రావు మళ్ళీ మెగాఫోన్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం దాసరి అందరూ కొత్తవాళ్ళతో “యంగ్ ఇండియా” అనే సినిమా చేస్తున్నాడు. దర్శకుడిగా ఇది దాసరి కి 149 వ చిత్రం. తన 150 వ చిత్రం కోసం దాసరి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నాడు. ఇన్నాళ్ళ తన సినీ ప్రస్థానంలో అరుదైన ఈ మైలురాయి తనకు ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోవాలని యోచిస్తున్నాడు. తదనుగుణంగా ఇప్పుడు దాసరి బాలయ్యతొ ఒక సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నాడు.” బొబ్బిలి పులి” తరహాలో ఆ సినిమా ఉంటుందని సినీ వర్గాల్లో గుస గుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పనుల్లో తల మునకలై ఉన్న దాసరి, ఆది పూర్తవ్వగానే భారీ ఎత్తున ఈ ఈ సినిమాని ప్రారంభిస్తాడని సమాచారం.తన నాన్నగారి రాజకీయ రంగ ప్రవేశానికి ముందు తనతో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దాసరి తో సినిమా చేయడానికి బాలయ్య కూడా సిద్ధంగా ఉన్నాడు.
0 comments:
Post a Comment