‘వరుడు’సక్సెస్ కోసం అల్లు అర్జున్ అంకెల గారెడి

Tuesday, April 6, 2010
అల్లు అర్జున్ ఇప్పటికి వరకూ చేసిన సినిమాలు ఒక ఎతైతే ‘వరుడు’ చిత్రం మరో ఎత్తు అయినది. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనీ మొదటి నుండి దర్శకుడు గుణశేఖర్ చెబుతున్న మాటలను ఒక్కసారి పరిశీలిస్తే ఆయన చెప్పినది కరెక్టే కాకపోతే హిట్ కు బదులు ఆయన చెప్పిన మాటలలో ప్లాప్ అని ఉండాల్సింది. అదొక్కటి తప్పు చెప్పడని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.

అయితే అల్లు అర్జున్ కెరీర్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోయిన అల్లు అర్జున్ కి ‘ఆర్య 2’ నుంచి బ్యాడ్ టైమ్ మొదలైంది. ‘ఆర్య2’ కమర్షియల్ గా కాస్త సేఫ్ అయినా, ‘వరుడు’ మాత్రం పూర్తిగా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది తొలి రోజే. అల్లు అర్జున్ కెరీర్ లోనే ‘బ్యాడ్’ చిత్రంగా విమర్శకులు, విశ్లేషకులు, ట్రేడ్ పండితులు తేల్చి చెబుతున్నారు.

అల్లు అర్జున్ మాత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అంటూ ‘వరుడు’ కి పబ్లిసిటీ చేసేస్తున్నాడు. మొదటి రోజు 7 కోట్ల 28 లక్షల రూపాయల వసూళ్ళని ప్రకటించిన బన్నీ, తాజాగా రెండో వారం నాటికి 14 కోట్లకు పైగానే లెక్క చెప్తున్నాడు. సక్సెస్ మీట్ తో పాటు, సక్సెస్ యాత్రలోనూ బిజీగా వున్న అల్లు అర్జున్ వున్నంతలో తన సినిమాని ‘హిట్’ అన్పించేందుకోసం నానా తంటాలూ పడ్తున్నాడు. ఈ లెక్కలు ఎన్నాళ్ళు కొనసాగిస్తాడోగానీ, ‘బద్రినాథ్’ తో మళ్ళీ బన్నీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అతని అభిమానులు కోరుతున్నారు.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates