పవన్ 'కొమరం పులి' పాట వినాలని ఉందా..ఇదిగో

Tuesday, July 6, 2010
పవన్ 'కొమరం పులి' చిత్రం ఆడియో టీజర్ సాంగ్ ని అఫీషియల్ గా నెట్ లో రిలీజ్ చేసారు. ఇక ఈ చిత్రం ఆడియో ఈ నెల 11న ఉదయం 11 గంటలకు రిలీజ్ కానుంది. ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ సంగీతం అందించే ఈ పాట మా తెలుగు తల్లికి అనే చరణంతో సాగుతుంది. గతంలో జనగణమణతో ఉర్రూతలూగించిన రహమాన్ ఈ పాటతో ఆంధ్రాని ఊగిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఎఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్ ని సోనీ మ్యూజిక్ వారు భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ 'కొమరం పులి' చిత్రం ఆగస్టు 12న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. శింగనల రమేష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ జె సూర్య సూర్య దర్శకత్వంలో రూపొందించారు. అలాగే పవన్ సరసన ఈ చిత్రంలో నిఖిషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇక ఈ క్రింద యూ ట్యూబ్ లింక్ ద్వారా సాంగ్ టీజర్ ని వినవచ్చు.http://coolguyramforyou.blogspot.com/2010/07/komaram-puli-audio-promo-maaralante.html

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates