కొన్ని సంవత్సరాల తరువాత తన సినిమా హిట్ అయినందుకు బాలకృష్ణ తెగ సంబర పడిపోతున్నారు. బాలయ్య నటించిన 'సింహా' చిత్రం ఘన విజయం సాధించి ఇటీవల అర్ధ శతదినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి బాలయ్య ఆనందంతో రాష్ట్రంలో ఉన్న నరసింహస్వామి ఆలయాలన్నింటినీ దర్శించుకున్నారు కూడా. ఇప్పుడు సింహా సినిమాలో ఆయన వాడిన కత్తులను, గండ్రగొడ్డలిని వేలం వేయనున్నారు. అంతకు ముందు యమదొంగ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన కోటు, హ్యాటులను, అలాగే మగధీర సినిమాలో రామ్ చరణ్ వాడిన కత్తి, డాలును వేలం వేసిన 'మా'(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్) ఇప్పుడు ఈ గండ్రగొడ్డలిని వేలం వేసి, వచ్చిన మొత్తాన్ని పేద కళాకారులకు ఇవ్వనున్నట్లు తెలిపింది.ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రారంభమైన వేలం పాటలో న్యూజెర్సీకి చెందిన గరికపాటి వెంకట్ 5 లక్షల రూపాయలకు గండ్రగొడ్డలిని కొనడానికి తొలి బిడ్డింగ్ వేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హాలీవుడ్ నటీనటులు వాడిన వస్తువులను, ఇతరాలను వేలం వేసే పద్ధతి ఎప్పటి నుండో ఉందని, ఇప్పుడు సింహా చిత్రంలో తను వాడిన కత్తులు, గండ్రగొడ్డలి నిరుపయోగం కాకుండా పరోక్షంగా ఉపయోగపడేలా 'మా' కార్యక్రమం తీసుకుని వాటి వేలానికి పూనుకోవడం చాలా ఆనందంగా ఉందని, వేలం పాట ప్రారంభాన్ని ప్రకటించక ముందే వాటిని కొనడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాలయ్యతో పాటు మా డైరక్టర్ మురళి మోహన్, బోయపాటి శ్రీను, ఝుమ్మంది నాదం హీరోయిన్ తాప్సీ కూడా పాల్గొన్నారు.
0 comments:
Post a Comment