రజనీకాంత్ 'రోబో' ఆంధ్రా రైట్స్ ఎంతకంటే...

Friday, March 5, 2010
రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న 'రోబో' చిత్రం మార్కెట్ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకునేందుకు ఇద్దరు నిర్మాతలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ తో కలిపి ఇరవై ఆరు కోట్ల రూపాయలకు కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంత ఎక్కువ రేటు అంటే గతంలో రజనీ చిత్రాలు చంద్రముఖి, శివాజి ఇక్కడ సంచలనం సృష్టించటం ఓ కారణమైతే, దర్శకుడు శంకర్ కి సైతం ఇక్కడ పెద్ద మార్కెట్ ఉండటం మరో రీజన్ గా చెప్తున్నారు. అలాగే ఏవీయం 175 చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండియాలోనే ఎక్కువ బడ్జెటుతో రూపొందుతున్న చిత్రంగా చెప్తున్నారు. అలాగే ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా చేయటం, రజనీ రోబోగా కనపించటం వంటి హైలెట్స్ ఉండటం ఈ చిత్రానికి ఇంత రేటు చెప్పటానికి కారణం గా చెప్తున్నారు. అలాగే ఈ రేటు పెట్టి స్ట్రెయిట్ చిత్రం చేసినా అంత ఓపినింగ్స్ ఉంటాయా ఉండవా అనేది సందేహమని, అదే ఈ చిత్రానికి చేసే గ్రాండ్ పబ్లిసిటీకి మినిమం ఓ నెల రోజులపాటు సినిమా హౌస్ ఫుల్స్ తో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఎవరికి దక్కుతుందనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates