హైదరాబాద్: హైస్కూల్ సినిమా ప్రదర్శనను నిలిపేస్తూ హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. సమాజంపై ఈ సినిమా దుష్ప్రభావం చూపుతుందని ఆరోపిస్తూ చక్రపాణి మరికొంత మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలున్నాయని కూడా వారు ఆరోపించారు. దీనిపై హైకోర్టు సినిమా ప్రదర్శనను ఈ నెల 9వ తేదీ వరకు నిలిపేస్తూ స్టే మంజూరు చేసింది.
పదిహేనేళ్ల బాలుడు 30 ఏళ్ల ఉపాధ్యాయురాలితో సాగించే ప్రేమాయణం ఇతివృత్తంగా హైస్కూలు సినిమా నిర్మితమైంది. టీచరుగా కిరణ్ రాథోడ్ నటించింది. సినిమాలోని పలు శృంగార సన్నివేశాలు సమాజంపై దుష్ప్రభావం వేసే ప్రమాదం ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. అయితే తాము ప్రతి సన్నివేశంలో మంచి సందేశం ఇచ్చామని దర్శకుడు నరసింహన్ ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. సినిమా ప్రదర్శనకు సెన్సార్ సర్టిఫికెట్ లభించిందని ఆయన చెప్పారు. అయితే, సెన్సార్ బోర్డు కూడా పలు సన్నివేశాలను కత్తిరించినట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment