Coolguyram Rating : 3.5/5
Movie Name విలన్
Banner మద్రాస్ టాకీస్
Producer మణిరత్నం, శారద త్రిలోక్
Director మణిరత్నం
Music ఎ ఆర్ రెహమాన్
Photography సంతోష్ శివన్
Story మణిరత్నం
Dialouge రామకృష్ణ
Lyrics స్వర్గీయ వేటూరి సుందరరామ్మూర్తి
Editing శ్రీకర ప్రసాద్
Art Choreography గణేష్ ఆచార్య, బృంద,
శోభన, అస్తాద్ దేబూ
Action శ్యామ్ కౌశల్, పీటర్ హెయిన్
Star Cast విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ,
ప్రియమణి, పృధ్వి తదితరులు
Release DateMovie Name విలన్

18-06-2010
Story
వీరయ్య (విక్రమ్) అత్యంత మొండివాడు. తన వారికి తానే చట్టం, తానే న్యాయం, తానే ధర్మం. పోలీసులంటే భయం, చట్టం అంటే గౌరవం అతనికి లేవు. అతని చెల్లి (ప్రియమణి) కి నచ్చిన వాడితో పెళ్ళి జరిపే సమయంలో, అతని మీద యస్.పి. (పృధ్విరాజ్) కాల్పులు జరిపగా, గాయపడ్డ వీరయ్య తప్పించుకుంటాడు. వీరయ్య కోసం అతని చెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను గ్యాంగ్ రేప్ చేస్తారు. ఆ బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో కోపంతో రగిలిన వీరయ్య ఆ పోలీసులందర్నీ రకరకాలుగా చంపేస్తాడు. ఆ యస్.పి. (పృధ్విరాజ్) భార్యను కిడ్నాప్ చేస్తాడు. యస్.పి.కి అతని మనసు తెలుసుకున్న భార్య రాగిణి (ఐశ్వర్యా రాయ్) ఉంటుంది. రాగిణి చాలా చక్కని శాస్త్రీయ నృత్య కళాకారిణి, ఆమెకు సంగీతం మీద కూడా మంచి పట్టుంది. వీరయ్య పోలీస్ ఆఫీసర్ మీద యుద్ధం మొదలు పెడతాడు. అప్పటి నుండి ఆ పోలీస్ ఆఫీసర్ కీ, వీరయ్యకీ మధ్య జరిగే యుద్ధంలో రాగిణి తన ప్రమేయం లేకుండా పావుగా మారుతుంది. ఆ తర్వాత మనం ఊహించని అనేక సంఘటనలు జరుగుతాయి. చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.
Analysisమణిరత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంత గొప్ప టెక్నీషియనో అందరికీ తెలిసిందే. అతని స్క్రీన్ ప్లే గురించీ, దర్శకత్వంలో అతని టేకింగ్ గురించీ, సినిమా టెంపోని ఎలా నడిస్తాడో అనే విషయాల గురించీ ఈ రోజున కొత్తగా చెప్పేదేం లేదు. అదంతా అతని గత చిత్రాలే నిరూపించాయి. కాకపోతే ఈ చిత్రంలో మణిరత్నం కొత్తగా ఏం చేశాడన్నది విశ్లేషించుకోవాలి అంతే. ఈ సినిమా తీయటంలో ఒక హాలీవుడ్ సినిమా ఎలా తీస్తారో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాడు మణిరత్నం.
ఈ చిత్రానికి అద్బుతమైన స్ర్కీన్‌ప్లే వుంది. కానీ.... ఈ చిత్రంలో మన నేటివిటీ బాగా మిస్సయ్యింది. సినిమా అంతా తమిళ వాసన కొడుతూంటుంది. సినిమా వీరయ్య పాయింట్ ఆఫ్ వ్యూ లో మొదలుపెడతారు. కొంత సినిమా జరిగాక రాగిణి పాత్రకు జరిగిన కథ చెప్పటంతో ఫ్లాష్ బ్యాక్ రివిల్ చేస్తారు. రామాయణాన్ని"సీతారాములు" అనే సినిమా ద్వారా దాసరి నారాయణరావు ఏనాడో సోషలైజ్ చేశారు. ఈ చిత్రమంతా టెక్నికల్ స్టాండ ర్డ్స్ ఆ చిత్రానికి లేవనుకోండి.... మన నేటివిటి మాత్రం ఉంది. ఈ సినిమాలో కూడా జటాయువు, హనుమంతుడు, విభీషణుడు శూర్పణఖ ఇలాంటి పాత్రలన్నీ ఉన్నా వాటి స్వరూపాలను మార్చాడు మణిరత్నం. ఈ చిత్రంలో చివరికి రాముడు హీరోనా, లేక రావణుడు హీరోనా అన్న విషయం డైలమాలో ఉండే విధంగా తీయటం మణిరత్నం గొప్పతనం. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించటంలో మరింత జాగ్రత్త తీసుకునుంటే బాగుండేది.
నటన -: వీరయ్యగా నటించిన విక్రమ్, గతంలో జాతీయ ఉత్తమనటుడిగా రెండు సార్లు అవార్డు సంపాదించిన వాడు. విపరీతమైన ఆకలితో ఉన్నవాడికి సరైన, సంపూర్ణమైన ఆహారం లభిస్తే ఏ రేంజ్ లో భుజిస్తాడో, ఈ చిత్రంలో విక్రమ్ నటన అలా ఉంది. అతనికి ఈ చిత్రంలోని వీరయ్య పాత్ర మరోసారి జాతీయ అవార్డు తెచ్చిపెడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అతని పాత్రలో అన్ని వేరియేషన్స్ వున్నాయి. ఇక మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ జాతీయ స్థాయి సినిమాల్లోనే కాక అంతర్జాతీయ స్థాయి సినిమాల్లో కూడా నటించిన అనుభవశాలి. రాగిణిగా ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఆమెను ఎలా చూపిస్తే సగటు ప్రేక్షకుడి నుండి అత్యున్నత స్థాయి ప్రేక్షకుడి వరకూ సంతోషపడతారో మణిరత్నంకు బాగా తెలుసు. ఈ సినిమా కోసం ఈ మాజీ ప్రపంచ సుందరి ఎన్నడూ పడని కష్టాలు పడిందని చెప్పవచ్చు. ఇక ప్రియమణి విషయానికి వస్తే... ఈమె కూడా జాతీయ ఉత్తమనటిగా అవార్డు సంపాదించిన నటే. తన పాత్ర నిడివి కొద్ది సేపే అయినా ఉన్నంతలో ఆమె బాగా నటించింది. ఇక సింగన్నగా ప్రభు, ఫారెస్టు గార్డుగా కార్తీక్ మురళి బాగానే నటించారు.
సంగీతం -: మన దేశానికి రెండు ఆస్కార్ అవార్డులనందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎ.ఆర్.రెహమాన్ ని సంగీత దర్శకుడిగా "రోజా" చిత్రంతో సినీ రంగానికి పరిచయం చేసింది మణిరత్నమే కనుక తన గురువు సినిమాకు తన శక్తి కొద్దీ చక్కని సంగీతం అందించాడనే చెప్పొచ్చు. పాటల్లో "ఉసురే పోయెనే", "కుళ్ళబొడిచేయ్" అనే పాటలు జనానికి బాగా ఆకట్టుకుంటాయి. ఇక రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి ప్రాణం పోసిందని చెప్పాలి.
కెమెరా -: సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని సెల్యులాయిడ్ దృశ్యకావ్యంగా మలచటానికి ఇతోధికంగా దోహదపడింది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేం ఒక పెయింటింగ్ లా మనకు కనపడుతుంది. వండర్ ఫుల్ ఫొటోగ్రఫీ. ఈ చిత్రంలో ఈ డిపార్ట్ మెంట్ అద్భుతంగా పనిచేసిందని చెప్పాలి.
ఎడిటింగ్ -: చాలా బాగుంది.
పాటలు -: దర్శక, నిర్మాత మణిరత్నంతో స్వర్గీయ వేటూరి సుందరరామ్మూర్తి గారి అనుబంధం 22 యేళ్ళ క్రితం వచ్చిన "గీతాంజలి" చిత్రం నుంచీ కొనసాగుతూ ఈ "విలన్" చిత్రం తో ముగిసింది. ఈ చిత్రానికి పేరు కూడా ఆయనే పెట్టారు. కానీ ఈ చిత్రంలోని పాటలు డబ్బింగ్ చిత్రంలోని పాటల్లాగా ఉండటం బాధాకరం.
మాటలు -: ఈ చిత్రం తమిళ వెర్షన్ కి శ్రీమతి సుహాసిని మణిరత్నం వ్రాయగా, తెలుగులో వచ్చిన "విలన్" చిత్రానికి రామకృష్ణ మాటలు వ్రాశారు. ఆయన మాటలు కొన్ని చోట్ల బాగున్నా అంతగా ఆకట్టుకోవు. పాటల్లాగానే ఈ చిత్రంలోని మాటలు కూడా డబ్బింగ్ చిత్రంలోని మాటల్లాగే ఉన్నాయి.
కొరియోగ్రఫీ -: నలుగురు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, బృంద, శోభన, అస్తాద్ దేబూ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్లుగా పనిచేశారు. "కుళ్ళుపుడితే కుళ్ళబొడిచేయ్..." పాటకు మాత్రం కొరియోగ్రఫీ అదిరింది. మిగిలిన పాటలు కూడా ఫరవాలేదు.
కాస్ట్యూమ్స్ -: సబ్యసాచి సాయి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సహజంగా, చాలా కొత్తగా సన్నివేశాలకు తగ్గట్టుగా, నటీనటులకు సరిపోయే విధంగా ఉంటూ, ఆ సీన్ మూడ్ ని ప్రతబింబించే విధంగా ఉన్నాయి.
యాక్షన్ -: శ్యామ్ కౌశల్, పీటర్ హెయిన్ ఇద్దరూ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పనిచేశారు. "మగధీర" చిత్రంతో పీటర్ హేయిన్స్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. శ్యామ్ కౌశల్ కూడా తక్కువ వాడేం కాదు. బాలీవుడ్ లో మంచి పేరున్నయాక్షన్ కొరియోగ్రాఫర్. మరి ఇలాంటి ఇద్దరు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ల కలయికతో వచ్చిన ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి.

అద్బుతమైన సాంకేతిక బలంతో తీసిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చెప్పటం కష్టం. మణిరత్నం దర్శకత్వం గురించి, విక్రమ్, ఐశ్వర్యరాయ్ నటనకోసం ఈ సినిమా చూడవచ్చు.
0 comments:
Post a Comment