సింహా విజయంతో ఉషారుగా ఉన్న బాలయ్యతో ఇప్పుడు తెలుగులోని టాప్ డైరక్టర్స్ అంతా ఆసక్తి చూపుతున్నారనే సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి,బాలకృష్ణ కాంబినేషన్లో ఎ టీవీ ఛానెల్ వారు ఓ చిత్రం చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎంత బడ్జెట్ అయినా సింహాద్రి లాంటి హిట్ బాలకృష్ణతో కొట్టాలని వారు రాజమౌళిని సంప్రదించినట్లు వినిపిస్తోంది. అయితే రాజమౌళి ఓకే చేసారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఇక ఎ టీవీ వారు ఇంతుకుముందు వెంకటేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో నమో వెంకటేశ, వీరూ పోట్ల దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా బిందాస్ చిత్రాలు రూపొందించారు. అయితే ఈ రెండు చిత్రాలు ఊహించిన విధంగా హిట్టయి లాభాలు తేలేకపోయాయి. దాంతో వారు రాజమౌళి, బాలకృష్ణల క్రేజీ కాంబినేషన్ ని క్యాష్ చేసుకోదలిచారు. ఇక మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వారు ఓ చిత్రం ప్లాన్ చేసారు. అలాగే అల్లరి నరేష్ హీరోగా ముళ్ళపూడి వీర భద్ర చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలోనే ప్రారంభించనున్నారు. మగధీర అనంతరం రాజమౌళి..హాస్య నటుడు సునీల్ హీరోగా మర్యాద రామన్న చిత్రం చేస్తున్నారు. సలోని ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.
0 comments:
Post a Comment