మోహన్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద హిట్టుగా నలిచిన 'పెదరాయుడు' చిత్రం ఇప్పుడు సీక్వెల్ రూపంలో మళ్ళీ తెలుగు తెరను పలకరించనుంది. ఈ ప్రయత్నానానికి మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు వర్ధన్ నడుం కట్టారు. వైవియస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'సలీం' చిత్రం బాగా నిరాశపరచటంతో విష్ణు ఈ చిత్రం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని అప్పటి డైరక్టర్ రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. జూన్ లో ప్రారంభమయ్యే ఈ చిత్రం కోసం ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు భోగట్టా. అలాగే ఈ చిత్రంలో రజనీకాంత్ ని గెస్ట్ రోల్ కి ఒప్పించే ఆలోచనలో మోహన్ బాబు ఉన్నట్లు కూడా వినపడుతోంది. ఎందుకంటే అప్పటి పెదరాయుడు లో సినిమా మొత్తం ఒకెత్తు అయితే రజనీకాంత్ ఎపిసోడ్ ఒకెత్తు. ఇక విష్ణు వర్దన్ తాజాగా రవిరాజా పినిశెట్టి శిష్యుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ ధ్రిల్లర్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు చిత్రాలను లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment