శ్రియకు నిర్మాతల మండలి...ఐదు లక్షల ఫైన్

Wednesday, March 17, 2010
అడ్వాన్స్ తీసుకుని సినిమా డేట్స్ ఎడ్జెస్టు చేయనందుకు తమిళ నిర్మాతల మండలి శ్రియ కు అసలు, వడ్డీతో కలిపి 15లక్షలు తక్షణమే చెల్లించాలని తీర్పు చెప్పింది. ఆ కంప్లైంట్ పూర్వా పరాలు ఇలా ఉన్నాయి.‘పొల్లాదవన్‌’(తెలుగులో కుర్రాడు) అనే సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన తమిళ నిర్మాత కథిరేశన్‌ శ్రియకు సినిమా చేయాలంటూ 10లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చారు. అప్పటికి అది అందుకున్న శ్రియ తర్వాత ఆ నిర్మాతకు డేట్స్ ఇవ్వలేదు. సరికదా విషయం తేల్చకుండా తిప్పించుకోసాగింది. దాంతో విసిగి వేసారిన ఆయన తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసారు. సినిమా చేయకపోయినా ఫర్లేదు తన అడ్వాన్స్‌ తనకు ఇవ్వమని కోరితే శ్రియ వేపు నుంచి స్పందన లేదని ఆ కంప్లైంట్ లో వివరించారుచ. పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట అసలు, వడ్డీ కలిపి 15లక్షలు శ్రీయ సదరు నిర్మాతకు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చారు. శ్రియ ఇంకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక శ్రియ ప్రస్తుతం పవన్ కళ్యాణ్...పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే రవితేజ హీరోగా రూపొందుతున్న 'డాన్‌ శీను'లోనూ హీరోయిన్ గా చేస్తోంది.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates