వివాహం ఖాయమైందంటూ...పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకునే (నిశ్చితార్ధం) వేడుక ఏప్రియల్ 1న ఎన్టీఆర్ అత్తవారి ఇంట జరగనుంది. ఆ రోజు ఎవరినీ పెద్దగా ఆహ్వానించకుండా తమ కుటుంబ సభ్యుల మధ్యే జరపాలనుకుంటున్నారు. ఈ పంక్షన్ తో ఇక ఈ సంవత్సరమే ఎన్టీఆర్... లక్ష్మీ ప్రణితిని పెళ్ళిచేసుకోనున్నారని కన్ఫర్మ్ చేసినట్లు అవుతుంది. ఇక లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నే శ్రీనివాస్...స్టూడియో ఎన్ ఛానెల్ కి యజమాని, తెలుగుదేశం పార్టి అధ్యక్ష్యుడు చంద్రబాబు నాయుడుకి మేనకోడలు అన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కి ముందుగా నిశ్చితార్ధ శుభాకాంక్షలు తెలియచేద్దాం. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం మున్నా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం చిత్రంలో చేస్తున్నారు. కాజల్, సమంతా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ తో కంత్రి చిత్రం డైరక్ట్ చేసిన మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి అనే చిత్రం చేస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ సోషియో పాంటసీ అని వినపడుతోంది.
0 comments:
Post a Comment