చెన్నై: నిత్యానంద స్వామితో పాటు వీడియో టేప్ లో ఉన్నది తానేనని సినీ నటి రంజిత అన్నది. నిత్యానంద స్వామితో లైంగిక కార్యకలాపాలు చేస్తూ వీడియో టేప్ కు చిక్కిన రంజిత మంగళవారం పెదవి విప్పింది. నిత్యానంద స్వామితో ఉన్నది తానేనని చెప్పింది. భక్తితో తాను నిత్యానంద స్వామికి సేవ చేశానని, అయితే దాన్ని కావాలనే అసభ్యంగా, అశ్లీలంగా చిత్రీకరించారని ఆమె ఆరోపించింది. తాను మానసికంగా చాలా కృంగిపోయానని ఆమె అన్నది. త్వరలోనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆమె అన్నది.కాగా, నిత్యానంద స్వామి త్వరలోనే భక్తుల ముందుకు వస్తారని ఆశ్రమ వర్గాలు చెప్పాయి. కావాలనే నిత్యానంద స్వామిని ఇరికించారని వ్యాఖ్యానించాయి. నిత్యానంద స్వామిపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పాయి. వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని కూడా చెప్పాయి.



0 comments:
Post a Comment