'చంద్రముఖి'తో 'లకలకలక' కు సిద్ధంమవుతున్న బాలయ్య..??

Tuesday, March 9, 2010
'చంద్రముఖి' సినిమా సీక్వెల్ గా వచ్చిన కన్నడ చిత్రం ఆప్తరక్షక సూపర్ హిట్ అవ్వడమే కాకుండా కన్నడ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. దీంతో ఈ సినిమా మీద అటు తమిళ ఇండస్ట్రీలో, ఇటు తెలుగు ఇండస్ట్రీలో ఆశక్తి నెలకొంది. తమిళంలో, తెలుగులో రజనీకాంత్ ను హీరోగా నటింపజేసి ఈ సినిమాను తీయాలని దర్శకుడు పి వాసు భావించిన రజనీ అందుకు సుముఖంగా లేడని వినికిడి. దీంతో ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చెయ్యనున్నడనే వార్త వినిపించింది. కానీ ఇప్పట్లో సినిమాలు చేసే ఆలోచన లేదని చిరు స్పష్టం చెయ్యడంతో ఇక ఈ సినిమాలో ఏ హీరో నటిస్తాడోనన్న సందేహం నెలకొంది.

ఈ విషయమై తాజాగా ఫిల్మ్ నగర్ సమాచారం ఏంటంటే ఈ సినిమాలో యువరత్న బాలకృష్ణ నటించనున్నాడట. ఈ సినిమా హక్కులను బాలయ్య వీరాభిమాని బెల్లంకొండ సురేష్ కొనడంతో పాటు బాలయ్య ఇంతకు ముందు పి వాసుతో మహారథి అనే సినిమాలో నటించివుండటంతో ఆ చనువుతో వీరిద్దరూ ఈ సినిమాలో బాలకృష్ణను నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. బాలయ్య అయితేనే ఇలాంటి పాత్రలకు న్యాయం చెయ్యగలుగుతాడని వారు అభిప్రాయపడుతున్నారట. ఇక బాలయ్య కూడా ఫ్యాక్షన్, యాక్షన్ నేపథ్యాన్ని వదిలి విభిన్నమైన సినిమాలు చెయ్యాలనే యోచనలో వుండటంతో ఖచ్చితంగా ఈ సినిమాలో నటించేందుకు అవకాశాలు వున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం బాలయ్య సింహా సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates