అల్లు అరవింద్ ను కలవరపెడుతున్న ప్రిన్స్ మహేష్ బాబు

Thursday, March 11, 2010
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు , త్రివిక్రమ్ లో వస్తున్న క్రే(లే)జీ చిత్రం ఖలేజా. అనుష్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే 30కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాత ఈ సినిమా తనని ఏ బస్టాప్ ప్లాట్ ఫార్మ్ కు చేరుస్తుందోనని భయపడుతుంటే త్రివిక్రమ్ మాత్రం మరో 20 కోట్లు వుంటే కానీ సినిమా పూర్తవదని చెప్పాడట. దీంతో ఇక సినిమాను నిలిపేస్తే మంచిదని నిర్మత రమేష్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమా హక్కులను 32కోట్లు పెట్టి కొన్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ విషయమై కలవరపడుతున్నాడట. అంతే కాదు ఈ విషయమై ఆయన మహేష్ బాబును ప్రశ్నించాలనుకుంటున్నారట. అయినా మహేష్ చాలా సూపరండీ బాబూ మాస్టర్ మైండ్ నే కలవరపెడుతున్నాడు.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates